: 10 వేల కోట్లతో త్రిపురలో విద్యుత్ కేంద్రం: మోదీ


ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపిస్తున్నారు. త్రిపురలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో 10 వేల కోట్ల రూపాయలతో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. సార్క్ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కు విద్యుత్ సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిలో మార్గదర్శకత్వానిదే కీలకపాత్ర అని మోదీ పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News