: తెలంగాణలో అక్టోబర్, నవంబర్ పింఛన్లు ఒకేసారి


తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్, నవంబర్ నెలల పింఛన్లను ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 15 తేదీల మధ్య పింఛన్ల పంపిణీ పూర్తి చేయనున్నారు. ముందు గ్రామ పంచాయతీల వారీగా పంపిణీ చేయాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు చెప్పారు. పింఛన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ సచివాలయంలోని కార్యాలయంలో ఈరోజు భేటీ అయ్యారు. కాగా, పింఛన్ల కోసం ఇంతవరకు 25.68 లక్షల మంది లబ్దిదారులను గుర్తించారు. పంచాయతీల వారీగా వారందరి జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగతా లబ్దిదారులను కూడా త్వరగా గుర్తించాలని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News