: అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులపై ఆంక్షలా?: వీహెచ్ పీ ధర్నా


అయ్యప్ప దీక్ష తీసుకున్న పోలీసులు సెలవులో ఉండాలనే నిబంధనలను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ నేతలు హైదరాబాదులో ధర్నా చేపట్టారు. ఈ నిబంధనలు హిందూ మత విశ్వాసాలను కించపరిచేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ, వీహెచ్ పీ కార్యకర్తలు నేడు అబిడ్స్‌లో ఆందోళన చేపట్టారు. తక్షణమే నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అబిడ్స్, కోఠి మార్గంలో ట్రాఫిక్ నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

  • Loading...

More Telugu News