: బాబా రాంపాల్ జైలుపాలు... ఇక, డేరా బాబా వంతు?


హర్యానాలో వివాదాస్పద బాబా రాంపాల్ జైలుపాలైన సంగతి తెలిసిందే. ఆశ్రమంలో అక్రమాలు, ప్రజలను మోసగించడం, ప్రైవేటు సైన్యాన్ని నిర్వహిస్తుండడం వంటి ఆరోపణలు ఆయనను కటకటాల వెనక్కి చేర్చాయి. హిసార్ లోని ఆశ్రమంలో జరిగిన పోరులో ఆరుగురు మరణించడంతో రాంపాల్ కథ కంచికి చేరింది! ఇక, తర్వాతి వంతు డేరా సచ్ఛా సౌధ మతాధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబాదేనంటూ వార్తలు వినవస్తున్నాయి. రాంపాల్ ఆశ్రమంలో ప్రత్యేక ఆపరేషన్ నిమిత్తం వెళ్లిన ప్రభుత్వ బలగాలపై ఆయన ప్రైవేటు సైన్యం దాడులకు దిగడం తెలిసిందే. అనంతరం, రాంపాల్ ఆశ్రమం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, డేరా బాబా ఆశ్రమంలో ఆయుధాలున్నాయేమో తెలుసుకునేందుకు ముందుగా సోదాలు చేయాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు భావిస్తోంది. కొందరు మాజీ సైనికాధికారులు డేరా బాబా ఆశ్రమంలో ప్రైవేట్ కమాండోలకు శిక్షణ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అటు, డేరా బాబాపై ఇంతకుముందు నమోదైన అత్యాచారం, హత్య కేసులపై పునర్విచారణ చేపట్టాలని న్యాయస్థానం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News