: కిలోమీటరు దూరం పరుగెత్తి చైన్ స్నాచర్ను పట్టుకున్న యువతి


మెడలోని బంగారు గొలుసును లాక్కుపోతున్న దొంగను కిలోమీటరు దూరం వెంబడించి పట్టుకుందో మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో జరిగింది. హరిద్వార్ నగరంలో ప్రైవేటు ట్యూషన్లు చెప్పుకొనే నిర్మలా పండిట్ ఇండోర్ లోని తన బంధువుల ఇంటికి వచ్చారు. ఏదో పని నిమిత్తం బయటకు వెళ్ళగా, ఓ వ్యక్తి వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడిని కిలోమీటరు దూరం వరకు పరుగెత్తి పట్టుకుని పోలీసులకు అప్పగించారు నిర్మల. ఆమె ధైర్యానికి మెచ్చుకున్న పోలీసులు 10 వేల రూపాయల రివార్డు ఇచ్చి సత్కరించారు.

  • Loading...

More Telugu News