: ప్లాన్ సింగపూర్ ది... శ్రమ జపాన్ ది... ఏపీ రాజధాని తీరు


ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సింగపూర్ ప్రణాళిక అందించనుండగా, జపాన్ కంపెనీలు నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వెల్లడించారు. జపాన్ కు చెందిన ఎన్నో కంపెనీలు రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణానికి ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు. రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు వివరించారు. ఈ నెలలో సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ భారత పర్యటనకు రానున్నారని, ఆ సమయంలో ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకుంటామని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News