: జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు గుర్తింపు


రెండో ప్రపంచ యుద్ధ సమయం నాటి బాంబును తాజాగా జర్మనీలో గుర్తించారు. 1.8 టన్నుల బరువున్న ఆ బాంబు డార్ట్మండ్ నగరంలో నిర్మాణ పనులు జరుగుతుండగా బయటపడింది. వెంటనే బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. అనంతరం ఆ ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు 16,500 మంది నివాసితులను ఖాళీ చేయించారు. అటువైపుగా ఏ వాహనాలు రాకుండా రహదారులన్నీ బ్లాక్ చేశారు. విమానాలు తిరగకుండా నో-ఫ్లై జోన్ గా ప్రకటించారు. తరువాత స్వ్కాడ్ అధికారులు ఆ బాంబును ఎంతో శ్రమించి విజయవంతంగా నిర్వీర్యం చేశారు. మొత్తం ఈ పనిలో వెయ్యి మంది పాల్గొన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. నవంబర్ 26న గుర్తించిన ఈ 'హెచ్ సీ 4000' బాంబు, మూడు మీటర్ల పొడవు, 80 సెంటీమీటర్ల వెడల్పు, 1.5 టన్నుల పేలుడు పదార్థాలతో నిండి ఉందట.

  • Loading...

More Telugu News