: ఢిల్లీ పోలీసు శాఖలో ఈశాన్య రాష్ట్ర యువతకు ఉద్యోగాలు: ప్రధాని మోదీ


ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగాలు కల్పిస్తామని ఫ్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతేకాక, తన సొంత రాష్ట్రం గుజరాత్ పోలీసు శాఖలో కూడా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 200 మంది యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, ఇంపాల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రస్తావించిన మోదీ... ఢిల్లీ, గుజరాత్ పోలీసు శాఖల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ప్రకటించడం విశేషం.

  • Loading...

More Telugu News