: జపాన్ పర్యటన ఎంతో తృప్తినిచ్చింది: చంద్రబాబు


నవ్యాంధ్రప్రదేశ్ లోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా చేపట్టిన జపాన్ పర్యటన తనకెంతో తృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జపాన్ లో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నింటిలో పర్యటించామని చెప్పారు. జపాన్ లో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని... జపనీయులు ఎంతో క్రమశిక్షణ గలవారని కొనియాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరముందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. మహిళలు కూడా అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వివరాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News