: వైకాపాలోకి టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉషశ్రీ
మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైకాపా నుంచి టీడీపీలోకి వలసలు జోరందుకుంటే, అందుకు భిన్నంగా సోమవారం టీడీపీ నుంచి ఓ కీలక నేత వైకాపాలోకి చేరిపోయారు. తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉషశ్రీ చరణ్ సోమవారం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని వైకాపా కార్యాలయం లోటస్ పాండ్ కు వెళ్లిన ఆమె పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన ఉషశ్రీ టీడీపీ నుంచి వైకాపాలోకి చేరిన వైనం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేసింది.