: వివాదాస్పద మంత్రికి ములాయం కితాబు!


సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ మంత్రి ఆజాం ఖాన్ కు కితాబిచ్చారు. మంత్రి హోదాలో మెరుగైన పనితీరు కనబరిచినందుకనుకుంటే మనం పొరబడినట్టే. ములాయం సింగ్ 75వ జన్మదినాన్ని ఆజాం ఖాన్ అంగరంగవైభవంగా నిర్వహించారు. 75 అడుగుల భారీ కేక్ తో పాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఆజాం ఖాన్, ములాయంకు మరిచిపోలేని రీతిలో ఆ కార్యాన్ని నిర్వహించారు. అంతేకాదు, ములాయం బర్త్ డే కోసం ఖర్చు పెట్టిన అంత భారీ నిధులెక్కడి నుంచి వచ్చాయన్న విమర్శకుల ప్రశ్నలకు ఏమాత్రం జడిసిపోని ఆజాం ఖాన్... తాలిబన్, దావూద్ ఇబ్రహీంలు డబ్బు పంపారంటూ వ్యంగ్యాత్మకతను జోడించి ఘాటుగా సమాధానమిచ్చారు. ఆజాం ఖాన్ ధీరత్వాన్ని మెచ్చుకున్న ములాయం, ‘‘అయినా నా జన్మదినం సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆజాం ఖాన్ ఎక్కడి నుంచి డబ్బు తెస్తే మీకెందుకూ?’’ అంటూ విరుచుకుపడ్డారు. ‘‘నా జన్మదినం సందర్భంగా 16 కిలో మీటర్ల మేర జనం క్యూ కట్టి మరీ నాకు శుభాకాంక్షలు చెప్పారు. వారంతా డబ్బు తీసుకుని వచ్చిన వారు కాదు. ఆజాం ఖాన్ నా జన్మదినాన్ని గొప్పగా నిర్వహించారు’’ అని ములాయం కీర్తించారు.

  • Loading...

More Telugu News