: భారత్ అధీనంలోకి బంగ్లాదేశ్ భూమి!
అసోం సరిహద్దుల్లో చొరబాట్లను నివారించేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో బంగ్లాదేశ్ అధీనంలోని భూమిని స్వాధీనం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ కు కొంత భారత భూమిని ఇచ్చేలా ల్యాండ్ స్వాపింగ్ డీల్ (భూ మార్పిడి) కుదుర్చుకోనున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. భూ మార్పిడి ఒప్పందం చొరబాట్లను నివారించే దిశగా, శాశ్వత పరిష్కారం చూపగలదని భావిస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ డీల్ కారణంగా అస్సామీల మనోభావాలు దెబ్బతింటాయని తనకు తెలుసునని, ఐతే, దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలు దగ్గరవుతాయని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్యోగ సృష్టికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.