: శివసేన నుంచి సానుకూల స్పందన వస్తుందనుకుంటున్నాం: సీఎం ఫడ్నవిస్


మహారాష్ట్రలో అధికారం పంచుకునే విషయంపై 80 శాతం చర్చలు ముగిశాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ప్రతిపాదించిన వాటికి వారి నుంచి సానుకూల స్పందన వస్తుందనే అనుకుంటున్నామని చెప్పారు. ఈ ఉదయం శివసేన నేతలను కలసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలో సేన చేరే విషయంపై రెండు రోజుల పాటు ఆ పార్టీ నేతలతో బీజేపీ నేతలు చర్చించారు. ఫడ్నవిస్ ప్రభుత్వంలో పది బెర్తులు ఇవ్వాలని బీజేపీ, సేన మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అందులో నాలుగు కేబినెట్ హోదా కాగా, మిగతా వాటిపై స్పష్టత లేదు. ఈ క్రమంలో సేన నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News