: పరిమితులు లేకుండా పెన్షన్లు: కేటీఆర్
పరిమితులు లేకుండా పేదలందరికీ పెన్షన్లు అందాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అర్హులైన లబ్దిదారులందరికీ పెన్షన్లు అందించాలని, ఈ విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించబోమని ఆయన స్పష్టం చేశారు. నేటి ఉదయం పెన్షన్లు, వాటర్ గ్రిడ్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. ఎంత ఖర్చయినా సరే పేదలందరికీ పెన్షన్లు ఇస్తామని కేటీఆర్ తెలిపారు.