: క్రికెటర్ అజారుద్దీన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ


మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అజర్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించనున్నాడు. హష్మీ దీనిపై మాట్లాడుతూ, ఈ పాత్ర తనకు సవాల్ వంటిదని పేర్కొన్నాడు. రెండున్నర గంటల్లో అజ్జూ భాయ్ జీవితాన్ని చూపించడం నిజంగా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అందుకు ఎంతో ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నాడు. క్రీడా నేపథ్యమే అయినా, సినిమాలో ఎక్కువగా అతని జీవితమే కనిపిస్తుందని అన్నాడు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

  • Loading...

More Telugu News