: బీజేపీలో చేరనున్న బొత్స?
సంవత్సరం క్రితం వరకూ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయాలను శాసించి, రాష్ట్ర విభజనకు సహకరించి, ప్రజలచే తిరస్కారానికి గురైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఆయన్ను చేర్చుకునేందుకు బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం విజయనగరం జిల్లాలో జరుగుతోంది. తొలి అడుగుగా, బొత్స అనుంగు అనుచరులుగా పేరున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇందుకూరి రఘురాజు, విజయనగరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముద్దాడ మధు ఇటీవలే బీజేపీలో చేరారు. బొత్స ఆజ్ఞలతోనే వీరు కాంగ్రెస్ పార్టీని వీడారని అనుకుంటున్నారు. బొత్స సైతం జిల్లా రాజకీయాలను పట్టించుకోకుండా, కేవలం హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. బొత్స బీజేపీలో చేరితే ఇక విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పని ఖాళీ అనే చెప్పాలి.