: చరిత్రలో 2014 అత్యంత ‘వేడి’ సంవత్సరం


చరిత్రలో ఇప్పటిదాకా అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా 2014 రికార్డులకెక్కింది. చరిత్రలో ఉష్ణోగ్రతలు నమోదు చేయడం 1880లో ప్రారంభం కాగా, ఇప్పటిదాకా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఏడాదిలోనే నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఈ విషయంలో 2010లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నాలుగేళ్లలోనే ఆ రికార్డును బద్దలు కొడుతూ ఈ ఏడాదిలో భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో భూగోళాన్ని ఇబ్బంది పెట్టిందని అమెరికాకు చెందిన ‘నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్’ (ఎన్ఓఏఏ) వెల్లడించింది. 20వ శతాబ్దంతో పొలిస్తే 21వ శతాబ్దంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగుతున్నాయని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 2014లో భూగోళంలోని ఏ ఒక్క ప్రాంతంలోనో కాకుండా ప్రతి ఖండంలోనూ, ప్రతి సముద్రంలోనూ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వెల్లడించింది. ఈ తరహాలో ఉష్ణోగ్రతలు ఏటేటా పెరిగితే పెను ముప్పు పొంచి ఉన్నట్లేనని 2009 నాటి కోపెన్ హగెన్ సదస్సు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News