: ప్రతీ ముగ్గురు పేదలలో ఒకరు భారతీయులే


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం నిరుపేదలలో మూడింట ఒక వంతు భారత్ లోనే ఉన్నట్లు ప్రపంచబ్యాంక్ నివేదిక వెల్లడించింది. అంటే ప్రతీ ముగ్గురిలో ఒకరు భారత్ కు చెందినవారేనని తెలుస్తోంది. రోజుకి 65 రూపాయలలోపు ఆదాయంతో రోజులు నెట్టుకొస్తున్న వారిని నిరుపేదలుగా ప్రపంచబ్యాంక్ లెక్కగట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 120కోట్ల మంది కఠిన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని వెల్లడించింది. రోజుకి 65 రూపాయల ఆదాయంలోపు ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ నేటికీ 120కోట్ల మంది ఆ స్థాయిలోనే బతుకులీడుస్తున్నారని తెలిపింది. ఈ లెక్కన మనదేశంలో సుమారు 40 కోట్ల మంది కడుబీదరికంలోనే ఉన్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News