: సహారా కుంభకోణంలో అమిత్ షా పాత్ర... పార్లమెంట్ ఆవరణలో తృణమూల్ ధర్నా
సహారా నిధుల సేకరణ స్కామ్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాత్ర ఉందని ఆరోపిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు, ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. అమిత్‌షా పేరు బయటకు రాకుండా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని, ఆయన సహారా సంస్థకు కొమ్ముకాశారని తృణమూల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, రాజ్యసభలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తృణమూల్ ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. సభాధ్యక్షుడికి వాయిదా తీర్మానం ఇచ్చారు.