: చైనా టు పాకిస్తాన్ వయా పీఓకే... భారత్ అభ్యంతరాలు బేఖాతరు
చైనా, పాకిస్తాన్ల మధ్య వందల కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగు లైన్ల రహదారిని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోడ్డు పాకిస్తాన్ అధీనంలోని కాశ్మీర్ (పీఓకే) గుండా వెళుతుంది. దీంతో సహజంగానే భారత్ ఈ ప్రాజెక్టుపై పలు అభ్యంతరాలను లేవనెత్తింది. చైనా మాత్రం ఆర్థిక సహకారం, రాకపోకలు సులభం చేయడం అంటూ పాకిస్తాన్ తో రహదారి నిర్మాణం కోసం 297 మిలియన్ డాలర్ల డీల్ ను కుదుర్చుకుంది. ఈ రోడ్డులో కొంతభాగం సమస్యాత్మక ప్రాంతం గుండా వెళ్లనుండటంతో 60 కిలోమీటర్ల దూరం మేరకు ఇరువైపులా బలమైన ఇనుప కంచెను బిగించనున్నారు. రోజురోజుకూ పాకిస్తాన్ తో పెరుగుతున్న చైనా స్నేహబంధం భారత్ కు తలనొప్పి తెచ్చి పెట్టే అంశమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.