: మోదీని పిలిస్తే తప్పేంటి?: త్రిపుర సీఎం
సుపరిపాలన అంశంపై తన కేబినెట్ ను ఉద్దేశించి ప్రసంగించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తే తప్పేమిటని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రశ్నిస్తున్నారు. ప్రతి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక సమస్యలు, అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయని అన్నారు. ఆ కోణంలోనే రాష్ట్రాల నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో ఆయన సోమవారం 726 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. కాగా, వామపక్ష ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ 'స్వచ్ఛ భారత్' అభియాన్ కు మద్దతు పలికారు. అయితే, 3-4 ఏళ్ల ముందే తాము త్రిపురలో ఈ తరహా కార్యక్రమాన్ని అమలు చేశామని చెప్పారు. దేశం పరిశుభ్రంగా ఉండడాన్ని అందరూ ఇష్టపడతారని పేర్కొన్నారు.