: శ్రీవారి సేవలో స్పీకర్ కోడెల, డ్రమ్స్ శివమణి
ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి, అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం శివమణి మాట్లాడుతూ, ఈ రోజు తన పుట్టిన రోజని, అందుకే తన భార్యతో కలసి స్వామి వారి దర్శనానికి వచ్చానని తెలిపారు. అందరూ సుఖశాంతులతో, ప్రశాంతంగా జీవించాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు.