: లంబసింగిలో 5, పోతురాజుస్వామి గుడి వద్ద 3 డిగ్రీలు... దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు


విశాఖ ఏజెన్సీ ప్రాంతాలను చలి వణికిస్తోంది. చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 5 డిగ్రీలకు పడిపోయింది. ఉదయం 9 గంటలవుతున్నా మంచు తెరలు తొలగిపోవడం లేదు. శీతాకాలం ప్రారంభంలోనే ఉష్ణగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో, రానున్న రోజుల్లో సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. పాడేరు ఘాట్ లోని అతిశీతల ప్రాంతమైన పోతురాజుస్వామి గుడి వద్ద 3 డిగ్రీలు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 6 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గిరిజనులు చలికి గజగజ వణుకుతున్నారు.

  • Loading...

More Telugu News