: టీవీ షోలో పాల్గొననున్న రాష్ట్రపతి, ప్రధాని


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలు ఓ టీవీ షోలో పాల్గొనేందుకు అంగీకరించారు. ‘ఇండియా టీవీ’ నిర్వహించే టీవీ కార్యక్రమం ‘ఆప్ కీ అదాలత్’లో వీరు కనిపించనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి 21 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా ఈ నెల 21న జరిగే షోలో వీరు పాలుపంచుకోనున్నారని ఇండియా టీవీ వెల్లడించింది. రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపింది.

  • Loading...

More Telugu News