: నెల్లూరులో వైన్ షాపుపై దోపిడీ దొంగల దాడి... ఒకరు మృతి


నెల్లూరులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని ఓ వైన్ షాపుపై దాడికి దిగిన దుండగులు షాపులోని నగదును అపహరించుకుని వెళ్లారు. ఈ క్రమంలో షాపులోని సిబ్బందిపై కత్తులతో దాడికి దిగిన దొంగలు ఓ వ్యక్తిని చంపేశారు. దొంగల దాడిలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత నగరంలోని అయ్యప్పగుడి సెంటర్ లోని వైన్ షాపు గోడకు కన్నం వేసి చొరబడ్డ దొంగలు నగదును అపహరించే యత్నం చేశారు. తమ యత్నాన్ని అడ్డుకున్న వైన్ షాపు సిబ్బందిపై దొంగలు కత్తులతో దాడికి దిగారు.

  • Loading...

More Telugu News