: ఢిల్లీ బయల్దేరిన గవర్నర్ నరసింహన్


గవర్నర్ నరసింహన్ కాసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోంశాఖ పిలుపు మేరకు ఆయన హస్తిన బయలుదేరారు. పర్యటనలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై ఆయన వారితో చర్చిస్తారు. అంతేకాకుండా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో కూడా గవర్నర్ సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News