: నేడు శ్రీలంక వెళుతున్న జాతీయ భద్రతా సలహాదారు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ రోజు శ్రీలంక వెళుతున్నారు. 'గాలే డైలాగ్ 2014' పేరుతో తీర ప్రాంత భద్రత, సహకారం అంశంపై జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో ఆయన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల చైనాకు చెందిన ఒక జలాంతర్గామి శ్రీలంక రాజధాని కొలంబో తీరప్రాంతానికి వచ్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఈ విషయంపై లంక నేతలతో అజిత్ దోవల్ చర్చించే అవకాశం ఉంది.