: గవర్నర్ ను ఇరుకున పడేస్తున్న 'రిపబ్లిక్ డే'


రానున్న గణతంత్ర దినోత్సవం గవర్నర్ ను ఇరుకున పడేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ అయిన నరసింహన్ రిపబ్లిక్ డే నాడు జెండాను ఎక్కడ ఎగురవేయాలనేది మొదటి సమస్య. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి... జెండాను ఇక్కడ ఎగురవేయవచ్చు. కానీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిపబ్లిక్ డే వేడుకలను ఏ విజయవాడలోనో లేక విశాఖలోనో ఏర్పాటు చేస్తే? గవర్నర్ కచ్చితంగా అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకు ఆయన జెండా ఎగురవేయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో రెండు చోట్ల ఒకే సమయంలో జెండా ఎగురవేయడం ఆయనకు సాధ్యమయ్యే విషయం కాదు. మరో సమస్య ఆయన ప్రసంగం. రాష్ట్రం తరపున ఆయన ప్రసంగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఆయన రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రసంగం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రసంగాలు రెండు శాసనసభలలో చేసిన ప్రసంగాల మాదిరే ఉంటాయి. ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వైరం నెలకొన్న నేపథ్యంలో, ఈ సమస్య నుంచి సామరస్యంగా గట్టెక్కడం నరసింహన్ కు కత్తిమీద సామే. ఇదే విషయమై కేంద్ర హోంశాఖను గవర్నర్ సలహా అడుగుతున్నారట.

  • Loading...

More Telugu News