: టీటీడీ బోర్డు సభ్యత్వంపై చంద్రబాబుకు మోదీ, అమిత్ షాల సిఫారసులు


త్వరలోనే టీటీడీ నూతన పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో, తెలంగాణ నుంచి కూడా ఇద్దరు లేదా ముగ్గురికి పాలకమండలిలో స్థానం దక్కనుంది. అంతేకాకుండా, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి ఒక్కొక్కరికి సభ్యత్వం ఇస్తుండటం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంలో, తాజాగా టీటీడీ పాలక మండలిలో సభ్యత్వాలను మహారాష్ట్ర, గుజరాత్ లకు కూడా ఇవ్వాలని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఫారసు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే, సొంత పార్టీ నుంచి ఒత్తిడులు ఉన్న పరిస్థితుల్లో జాతీయ అగ్ర నేతల నుంచి కూడా సిఫారసులు వస్తుండటంతో ఆయనపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.

  • Loading...

More Telugu News