: అంత్యాక్షరిలో అల్లరల్లరి చేసిన వెంకీ, చిరు


విశాఖ తుపాను బాధితుల కోసం తెలుగు సినీ పరిశ్రమ నిర్వహించిన మేము సైతంలో అంతిమ కార్యక్రమం అంత్యాక్షరిలో టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, చిరంజీవి అంతులేని అల్లరి చేశారు. ప్రత్యర్థి జట్టు పాట ఇవ్వడం పొరపాటు... వీరే పాడేసేవారు. దీంతో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాక, స్టార్ హీరోలు కనుక వారికి అడ్డు చెప్పలేక, అక్కడి వారు ఇబ్బంది పడితే... సినీ అభిమానులు మాత్రం స్టార్ హీరోలన్న ఫీలింగ్ లేకుండా ఇద్దరూ అంత గొప్పగా ఆస్వాదించడాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా వెంకీ అల్లరికి హద్దు లేకపోవడాన్ని, డాన్సులు, అల్లరి పాటలను, చిలిపి యాక్షన్ ని చూసి అంతా ఫిదా అయిపోయారు. సినీ కుటుంబంలో వెంకీ ఎంత అల్లరి పిల్లాడో అభిమానులు చూసే అవకాశం కలిగింది. వెంకీ చేసిన అల్లరికి సినీ నటులే కడుపుబ్బ నవ్వారు. దీంతో ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగిపోయింది. పది గంటలకే ముగుస్తుందనుకున్న కార్యక్రమం వారిద్దరి ఆటపాటలతో మరింత ఆలస్యంగా, ఆద్యంతం ఆసక్తికరంగా, రసరంజకంగా జరిగింది.

  • Loading...

More Telugu News