: ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు


ఎయిర్ ఇండియా విమానానికి పెనుప్రమాదం తప్పింది. ముంబై నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానం జోద్పూర్ లో ఉదయం 11.40 గంటలకు కిందకు దిగిన వెంటనే టైరు పేలింది. ఆ సమయంలో విమానంలో 128 మంది ప్రయాణికులు ఉన్నారు. టైరు పేలిపోవడంతో పెను ప్రమాదం జరుగుతుందని అంతా భావించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది మరో విమానంలో టైర్ తీసుకొచ్చి, మార్చి, మరమ్మతులు చేశారు. దీంతో విమానం మూడు గంటలు ఆలస్యంగా ఢిల్లీ బయల్దేరింది.

  • Loading...

More Telugu News