: ఆసక్తి రేపిన చంద్రబాబు, చిరు ముచ్చట్లు
'మేము సైతం' అంటూ తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఒకే వేదికపై ముచ్చట్లాడుతూ సందడి చేశారు. విశాఖ ప్రజలను ఆదుకునేందుకు చేపట్టిన కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు విచ్చేసిన సందర్భంగా చిరంజీవి ఆయనను విష్ చేసి ఆయన పక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ కనిపించారు. సినీ కుటుంబం యావత్తూ చంద్రబాబును ఆదరంగా ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భంగా సినీ నటులందరినీ పలకరిస్తూ ప్రతి ఒక్కరికీ బాబు అభివాదం చేశారు. ఒకప్పటి టీడీపీ, ప్రస్తుత టీఆర్ఎస్ నేత బాబూమోహన్ ఈ సందర్భంగా నెమ్మదిగా తలతిప్పేశారు. అది గమనించని బాబు ఆయన పక్కనుంచే వెళ్లిపోయారు.