: ఆర్ఆర్బీ పేపర్ లీక్...హైటెక్ ముఠా అరెస్టు


రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షను హైటెక్ పధ్ధతిలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే క్వార్టర్స్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్న ముఠాని పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని 24 మందితోపాటు పరీక్ష రాసే 10 మంది అభ్యర్థులను అరెస్ట్ చేశారు. ఈ పరీక్షకు హైదరాబాదు చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్, సరూర్ నగర్ లోని చైతన్య జూనియర్ కాలేజీ, తిరుమలగిరిలోని గౌతమి మోడల్ స్కూల్ కేంద్రాలుగా ఉన్నాయి. ఓ రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో ఈ మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పరీక్ష రాసే అభ్యర్థులు మెడలో తాయెత్తు రూపంలో డివైజ్, చెవిలో బ్లూటూత్ తో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. మాస్ కాపీయింగ్ చేస్తున్న పది మంది అభ్యర్థులను చైతన్యపురి, తిరుమలగిరిలలో ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హైటెక్ మాస్ కాపీయింగ్ స్కాంలో మొత్తం 34 మందిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News