: 111 మందికి 4.9 కోట్లతో కన్యాదానం చేసిన వ్యాపారవేత్త


దానాల్లో కన్యాదానం గొప్పదని పెద్దలు చెబుతుంటారు. దానిని స్పూర్తిగా తీసుకున్నాడో, లేక సంపాదనకు ఓ అర్థం ఉండాలని భావించాడో కానీ సూరత్ కు చెందిన మహేష్ సావాని అనే వ్యాపారవేత్త తండ్రిని కోల్పోయిన 111 మంది యువతులకు తండ్రిగా కన్యాదానం చేశారు. ఈ మధ్యాహ్నం పూర్తయిన ఈ తంతులో ప్రతి కుమార్తెకు 4.5 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి తదితర వస్తువులను కట్నకానుకలుగా అందజేశారు. కేవలం కట్నకానుకలుగా అందజేసిన మొత్తం 4.9 కోట్లు. వివాహ ఖర్చులు అదనం. ఇందులో వివిధ కులాలకు, మతాలకు చెందిన వారున్నారు. వారిలో ముగ్గురు ముస్లిం యువతులకు వారి సంప్రదాయపద్ధతిలో వివాహం జరిపించారు. ఆయన చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News