: వెంకీ టీం 69... సుధీర్ బాబు, అర్చన, తారకరత్న రెండేసి వికెట్లు
'మేము సైతం' అంటూ తెలుగు సినీ పరిశ్రమ హుదూద్ బాధితులను ఆదుకునేందుకు నిధుల సేకరణకు ఆడుతున్న ఆరు ఓవర్ల పరిమిత క్రికెట్ మ్యాచ్ లో హీరో వెంకటేష్ టీం తొలి మూడు ఓవర్లలోనే 57 పరుగులు చేసింది. కెప్టెన్ వెంకీ తొలి ఓవర్ లో 24 పరుగులు సాధించాడు. దీంతో మిగిలిన మూడు ఓవర్లలో మరిన్ని పరుగులు వస్తాయని ఆశించిన అభిమానులను నిరాశకు గురి చేస్తూ, కేవలం 69 పరుగులు మాత్రమే సాధించింది. మరో మూడు ఓవర్లలో తారకరత్న రెండు వికెట్లు, సుధీర్ బాబు మూడు వికెట్లు, హీరోయిన్ అర్చన రెండు వికెట్లు తీసి రాణించారు. దీంతో వెంకటేష్ జట్టు, ప్రత్యర్థి రాంచరణ్ జట్టుకు 70 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది.