: టీడీపీ వాళ్లు తప్ప ఇతరులు పనికిరారా?: రోజా


ఇసుక కమిటీల్లో టీడీపీ కార్యకర్తలు తప్ప ఇతరులు పనికిరారా? అని వైఎస్సార్సీపీ నేత రోజా ప్రశ్నించారు. చిత్తూరులో ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువగా ఉందని అన్నారు. ప్రభుత్వ తీరును గమనించిన ప్రజలు ఆరు నెలల్లోనే నిరసన గళం విప్పుతున్నారని ఆమె పేర్కొన్నారు. చెరుకు రైతులకు బకాయిలు చెల్లించకుండా యాజమాన్యాలకు లాభం చేకూరుస్తోందని ఆమె ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఎస్సీ ఎస్టీల విషయంలో కూడా టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారని రోజా మండిపడ్డారు.

  • Loading...

More Telugu News