: ఎన్టీఆర్ పై నాగార్జున విజయం
జూనియర్ ఎన్టీఆర్ క్రికెట్ జట్టుపై నాగార్జున జట్టు విజయం సాధించింది. హైదరాబాదులోని యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆరేసి ఓవర్ల పరిమిత క్రికెట్ మ్యాచ్ లో 74 పరుగుల విజయలక్ష్యంతో క్రీజులో దిగిన ఎన్టీఆర్ జట్టులో సాయిధరమ్ తేజ్ మూడు సిక్సులు, ఒక ఫోర్ తో రాణించగా, సంగీత దర్శకుడు తమన్ మూడు సిక్సులు, రెండు ఫోర్లతో సత్తాచాటాడు. వీరిద్దరూ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. దీంతో ఎన్టీఆర్ జట్టు 64 పరుగులు సాధించి విజయానికి పది పరుగుల దూరంలో చతికిలపడింది. దీంతో నాగార్జున జట్టు ఫైనల్ కు అర్హత సాధించింది.