: ఈవ్ టీజర్లను చితకబాదిన అక్కాచెల్లెళ్లు
హర్యానాలోని రోహ్ తక్ లో హర్షించదగ్గ సంఘటన చోటుచేసుకుంది. ఈవ్ టీజర్లను అక్కాచెల్లెళ్లు చితకబాదారు. బస్సులో వెళ్తున్న అక్కాచెల్లెళ్లను ముగ్గురు ఈవ్ టీజర్లు వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆగ్రహం ముంచుకొచ్చిన అక్కాచెల్లెళ్లు ఈవ్ టీజర్లకు ఎదురు తిరిగారు. ఒక టీజర్ ను దొరకబుచ్చుకున్న సిస్టర్స్ అతని బెల్టు ఊడదీసి చితకబాదారు. అనంతరం అతనిని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. కాగా, అతనిపై పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం విశేషం. హర్యానాలో భ్రూణ హత్యలు, పరువు హత్యలు, పంచాయతీ పేరిట పేదల గొంతు కోయడం సర్వసాధారణం, దీనిపై మండిపడుతున్న పలు ప్రజాసంఘాలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, అక్కా చెల్లెళ్లను అభినందిస్తున్నాయి.