: సుల్తాన్ బజార్ లో ఉద్రిక్తత
హైదరాబాదులోని సుల్తాన్ బజార్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రగతి మహావిద్యాలయం కళాశాలలో ఈవ్ టీజింగ్ నేపథ్యంలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో హర్షవర్థన్ అనే విద్యార్థి మృతి చెందాడు. దీంతో హర్షవర్థన్ పార్థివ దేహంతో అతని బంధువులు కళాశాల ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో కళాశాల గేట్లు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన ఆందోళనకారులు, కళాశాల ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు.