: 6 ఓవర్లలో నాగార్జున జట్టు 73 పరుగులు


హుదూద్ బాధితుల కోసం హైదరాబాదులో సినీ తారలు నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమంలో క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన నాగార్జున జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. 6 ఓవర్ల పరిమిత మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన వర్ధమాన హీరో నాగశౌర్య తొలి ఓవర్ లో నాలుగు సిక్స్ లు, ఒక ఫోర్ బాది అద్భుతంగా ఆడాడు. అనంతరం అఖిల్ మూడు సిక్స్ లు, ఒక ఫోర్ తో రాణించగా, శర్వానంద్ సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు. హీరోయిన్ రకుల్ ఫ్రీత్ సింగ్ రెండు ఫోర్లు కొట్టడం విశేషం, కాగా, అల్లరి నరేష్, సచిన్ జోషి, సాయి కుమార్, నిఖిల్ విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 6 ఓవర్లలో నాగార్జున జట్టు 73 పరుగులు సాధించి, జూనియర్ ఎన్టీఆర్ జట్టుకు 74 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

  • Loading...

More Telugu News