: ఇలాంటి మాటలు వినే హీరోలు షెడ్డుకు వెళ్ళిపోతున్నారు: మహేష్ బాబు
"ఇలాంటి మాటలు వినే హీరోలు షెడ్డుకు వెళ్ళిపోతున్నారు" అంటున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. 'మేము సైతం'లో భాగంగా మహేష్, త్రివిక్రమ్, సమంతాలు కలసి ఒక స్కిట్ ప్రదర్శించారు. ఇందులో మహేష్, త్రివిక్రమ్ లను ఇంటర్వ్యూ చేసే బబ్లీ గర్ల్ పాత్రలో సమంతా నవ్వులు పూయించే ప్రశ్నలు వేసింది. మీ సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని సమంతా పొగడగా, మహేష్ పై వ్యాఖ్యలు చేశారు. తను తెలుగు సినిమాల టెక్నాలజి స్థాయిని పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. తన సినిమాల్లో 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి' ఇష్టమని వివరించాడు. ఇటీవల విజయ్ నటించిన తమిళ సినిమా 'కత్తి' చూశానని, అయితే తాను రీమేక్ చిత్రాలు చేయనని తెలిపారు.