: అతి త్వరలో ప్రణాళికా సంఘం రద్దు!
అభివృద్ధి దిశగా చేపట్టాల్సిన చర్యలపై ప్రతి ఐదేళ్లకోసారి విధాన పరమైన నిర్ణయాలు ప్రకటించే ప్రణాళికా సంఘం రద్దు కానుంది. సుమారు 64 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త పేరుతో మరో కమిటీని నియమించాలన్నది మోదీ ఆలోచన. వచ్చే వారంలో జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని సీఎంలతో చర్చించనున్నారని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కొత్త కమిషన్ కు భారత్ ప్రగతి లక్ష్య, నితి ఆయోగ్, పాలసీ కమిషన్, నేషనల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, సోషల్ ఎకనామిక్ డెవలప్ మెంట్ కమిషన్ లలో ఏదో ఒక పేరును ఖరారు చేయనున్నట్టు సమాచారం.