: అబాట్ తప్పేమీ లేదు: మైఖేల్ క్లార్క్
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణం దైవ నిర్ణయమే తప్ప ఎవరూ కారణం కాదని కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. ఫిల్ హ్యూస్ కు బౌన్సర్ వేసి ఆయన మరణానికి పరోక్షంగా కారణమైన బౌలర్ సీన్ అబాట్ ను క్లార్క్ వెనకేసుకొచ్చాడు. అబాట్ మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడని, గతాన్ని మరచి ఆటపై దృష్టిని పెట్టాలని పిలుపిచ్చాడు. అబాట్ ను ఎవరూ తప్పు పట్టడం లేదని, అలా చేయాల్సి వస్తే మొత్తం క్రికెట్ కుటుంబాన్నే తప్పు పట్టాలని అన్నాడు.