: నట సింహం బాలయ్యలో మరో కోణం
సినిమాల్లో తన అద్భుత నటన, డైలాగులతో అభిమానులను అలరించే నందమూరి బాలకృష్ణ 'మేము సైతం'లో పాట పాడి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. 'చలాకి చూపులతో మత్తెక్కించావే' అంటూ కౌసల్యతో కలసి పాట పాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఇలా పాట పాడటం తనవల్ల కాదని, అది ఒక్క 'సింహా'నికే సాధ్యమని మరో నటుడు వెంకటేష్ కితాబిచ్చారు.