: ప్రారంభమైన 'మేము సైతం'... శ్రియ అద్భుత నృత్యం
ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ చేపట్టిన 12 గంటల నాన్ స్టాప్ లైవ్ షో 'మేము సైతం' నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సినీ పరిశ్రమ ప్రముఖులు దాసరి నారాయణరావు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో గాయనీ గాయకులు 'మేము సైతం' అంటూ పాడగా, అందాల నటి శ్రియ 'వందేమాతరం' గీతానికి అద్భుత రీతిలో నృత్యం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించింది.