: పారిపోయిన ముషారఫ్...
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పారిపోయారు. బెయిల్ పొడిగించాలన్న ముషారఫ్ అభ్యర్థనను తోసిపుచ్చిన ఇస్లామాబాద్ కోర్టు అతడిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది. కోర్టు ఆదేశాలు వెలువడడం ఆలస్యం.. అరెస్ట్ భయంతో పోలీసులకు దొరకకుండా ముషారఫ్ అక్కడి నుంచి జారుకున్నారు.