: కు.ని శస్త్రచికిత్సల్లో ఘోరం... సైకిల్ పుంపుతో గాలి కొడుతున్న డాక్టర్!


మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే విషయంలో కొందరు వైద్యులు ఎంతటి హీనమైన పద్ధతులను వినియోగిస్తున్నారో తెలిపే సంఘటన ఇది. ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలో కు.ని. ఆపరేషన్ల సమయంలో యోని కండరాలను వ్యాకోచింపచేసేందుకు సైకిల్ పుంపుతో గాలి కొడుతూ దొరికిపోయాడో వైద్యుడు. ఈ విషయంలో తక్షణం విచారణకు ఆదేశించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కు.ని. శస్త్రచికిత్స చేసిన వైద్యుడు మహేష్ చంద్ర మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. ఖరీదైన వైద్య పరికరాలు అందుబాటులో లేకనే తాము ఈ విధానం అవలంబిస్తున్నామని తెలిపారు. యోనిని వెడల్పు చేసేందుకు ఇది సహజమైన విధానమని అన్నారు. కాగా, మొత్తం 56 మందికి ఇలా ఆపరేషన్ లు జరిగాయని తెలుస్తోంది. అంగుల్ జిల్లా కలెక్టర్ ను నివేదిక కోరినట్టు వైద్యశాఖ కార్యదర్శి ఆర్తి అహుజా తెలిపారు.

  • Loading...

More Telugu News