: నల్లజాతి యువకుడిని కాల్చిచంపిన పోలీసు అధికారి రాజీనామా
అమెరికాలోని ఫెర్గూసన్ లో నిరాయుధుడైన ఓ నల్ల జాతి యువకుడిని కాల్చి చంపిన పోలీసు అధికారి డారెన్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనలో విల్సన్ తప్పేమీ లేదని విచారణ అధికారులు తేల్చిన తరువాత ఫెర్గూసన్ ప్రాంతంలో జాతి విభేదాలు తలెత్తి, అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెర్గూసన్ లో నివసిస్తున్న ప్రజలు, పోలీసుల క్షేమం కోసం తాను రాజీనామా చేస్తున్నట్టు విల్సన్ పేర్కొన్నారు.