: లారీని ఢీకొన్న ప్రియాంకా ట్రావెల్స్ బస్సు... డ్రైవర్, క్లీనర్ మృతి
విజయవాడ నుంచి హైదరాబాదుకు వస్తున్న ప్రియాంక ట్రావెల్స్ బస్సు (ఏపీ 10 వీ 2255) నేటి తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. హయత్ నగర్ మండలం పరిధిలోని అంబర్ పేట వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లారీ టైరు పంక్చర్ కావడమే ప్రమాదానికి కారణమని తెలిసింది.