: లాలూకు ఎయిమ్స్ లో మైనర్ ఆపరేషన్!


బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో మైనర్ ఆపరేషన్ చేయించుకున్నారు. శుక్రవారం ఆస్పత్రిలోని ప్రైవేట్ వార్డులో చేరిన లాలూకు చిన్నపాటి శస్త్రచికిత్స చేసినట్లు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. అయితే ఏ కారణం చేత లాలూకు ఆపరేషన్ చేశారన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన ఎలాంటి తీవ్ర అనారోగ్యంతో బాధపడటం లేదని, త్వరలోనే ఆయనను డిశ్చార్జి చేస్తామని ఎయిమ్స్ అధికార ప్రతినిధి అమిత్ గుప్తా చెప్పారు.

  • Loading...

More Telugu News